- connect@raajneetistrategies.com
+91 98765 43210
GHMC 2021
వేలాది మంది ప్రజల ప్రతినిధిగా, ప్రపంచంలో 150 దేశాల కన్నా పెద్దది అయిన మన హైదరాబాద్ నగర పరిపాలనను నడిపించే అధికారం. ప్రజలు “కార్పొరేటర్ సాబ్” పిలుస్తుంటే ఉండే మజా..
మనం వేయించిన రోడ్డు మీద ప్రజలు హాయిగా ప్రయాణిస్తుంటే ఉండే కిక్... కొన్ని వేలమందికి నాణ్యమైన జీవితాన్ని అందించే గొప్ప అవకాశం..
సమాజంలో పలుకుబడి, గౌరవం, మర్యాద.. ఇదీ కార్పొరేటర్ పదవి అంటే.. అందుకే ఈ పదవులకి అంత పోటీ.. ఈ పోటీలో తలబడి.నిలబడి.. గెలవాలి అంటే..?
- ఒక బలమైన పార్టీ టికెట్ తెచ్చుకోవాలి (ఇండిపెండెంట్ లు గెలవడం బాగా తక్కువ)
- ప్రజలకి అభ్యర్థి మీద నమ్మకం కలగాలి
- పార్టీ క్యాడర్ మ్యానేజ్ మెంట్ చూసుకోవాలి
- మీడియాతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి
- ఎన్నికల ప్రచారం బాగా చేయాలి, ఓటర్లని ఆకట్టుకునేలా మాట్లాడాలి.
- పోలింగ్ రోజు ఓటర్లని బూత్ కి రప్పించాలి..ఓటు వేయించుకోవాలి.
ఇవి చేయాలి అంటే, కొన్ని స్కిల్స్ కావాలి, ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, మిమ్మల్ని మీరు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. ఈ దిశగా మీ మొదటి అడుగు ఈ శిక్షణా కార్యక్రమం.
ఈ రెండు రోజుల శిక్షణ లో ఈ క్రింది అంశాలు ఉంటాయి.
- GHMC గురించిన ఆసక్తికర సమాచారం, వైశాల్యంలో ఎంత పెద్దది? జనాభా రీత్యా
- ఎన్ని దేశాల కంటే పెద్దది?
- బడ్జెట్ ఎంత? చరిత్ర ఏంటి?
- GHMC బాధ్యతలు ఏంటి?
- కార్పొరేటర్ అంటే ఏంటి? కార్పొరేటర్ అధికారాలు ఏంటి? తదితర విషయాలు
- ఫిజికల్ అప్పీయరెన్స్ ( క్లాస్ లీడర్, మాస్ లీడర్ లుక్స్) ఓటర్లని ప్రభావితం చేస్తుందా?
- మాటతీరు ఎలా ఉండాలి?
- ప్రజలని ఆకట్టుకునేలా ఎలా ప్రసంగించాలి?
- పర్సనల్ లైఫ్ లో ఎలా ఉండాలి? (వ్యక్తిగత బలహీనతలు అధిగమించడం)
- లీడర్ షిప్ క్వాలిటీస్ ఏంటి?
- మీలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయా?
- ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం ఎలా?
- పార్టీలో మీ పొజిషన్ బలపరచుకోవడం ఎలా?
- క్యాడర్ తో ఎలాంటి సంబంధాలు ఏర్పరచుకోవాలి?
- పార్టీలో మీ కాంపిటీటర్స్ తో ఎలా వ్యవహరించాలి?
- అధిష్టానాన్ని మెప్పించడం ఎలా?
- ఇమేజ్ పెంచుకోవడం కోసం సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుంది?
- సోషల్ మీడియా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మీడియాలో గుర్తింపు తెచ్చుకోవడం ఎలా?
- పార్టీ టికెట్ వచ్చాక ఎలక్షన్ కి తక్కువ సమయం ఉంటుంది, కాబట్టి ఎన్నికలకు ఇప్పటినుండే సన్నద్ధం కావాలి. అందుకోసం ఏం చేయాలి?
శిక్షణ కార్యక్రమం వివరాలు:
- 1. ఈ శిక్షణ మొదటి బ్యాచ్ జూలై 4,5 తేదీలలో ఉండవచ్చు. (కరోనా కారణంగా ప్రభుత్వ ఆంక్షలను బట్టి ఈ తేదీ మారవచ్చు).
- 2. ఒక్కో బ్యాచ్ కు 50 నుండి 70 మంది ఉంటారు.
- 3. ఇది హైదరాబాద్ లో ఏదైనా కాన్ఫరెన్స్ హాల్ లో ఉంటుంది.
- 4. ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటే, ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ అంటే ముందు రిజిస్టర్ చేసుకున్న వారికి ముందు క్లాసులు ఉంటాయి.
- 5. దీనిలో ఏ పార్టీ వారైనా , ఇండిపెండెంట్ గా పోటీ చేసే వారైనా పాల్గొనవచ్చు.
- 6. దీనిలో పాల్గొనే వారికి పర్సనల్ ఎవాల్యుషన్ కూడా చేసి, వారు మెరుగుపరచుకోవాల్సిన అంశాలు సూచిస్తాము.
- 7. ఏ వర్కుషాప్ లో బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ,ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేయబడును
- 8. మీరు registration చేసుకున్న తరువాత మీకు ఈ వర్కుషాప్ ఎన్రోల్మెంట్ ఫీజు డీటెయిల్స్ షేర్ చేయబడును.